భగవంతుని మనస్ఫూర్తిగా నమ్మి ఆ భగవంతుని ప్రార్థిస్తే ఆయన మన వెంటే ఉంటాడు అనడానికి ఉదాహరణగా ఒక కథ చెప్తాను వినండి. శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ఎప్పుడూ ప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది. ఆ ప్రసాద వితరణ జరిగే స్థలానికి నిత్యం ఒక బ్రాహ్మణుడు వచ్చి తనకు మాత్రమే కాకుండా తన ఆరుగురు కొడుకులకు కూడా ప్రసాది ఇవ్మని అడిగేవాడు. అయితే ఒకటి రెండు సార్లు ఇచ్చిన యాజమాన్యం మళ్ళీ మళ్ళీ అలాగే అడగడంతో అతనితో వివాదానికి దిగారు.
ఇదంతా గమనించిన శ్రీ రామానుజాచార్యుల వారు ఏమయ్యా నువ్వు స్వామి వారికి కైంకర్యం చేసి ప్రసాదం తీసుకెళ్లొచ్చు కదా అని అడిగారు. అయితే అప్పుడు ఆయన అన్నాడు స్వామి నా కొడుకులు ఆరుగురు కూడా రోగిష్టులు వాళ్ళ కింద సేవ చేయడానికే నాకు సమయం సరిపోదు. ఇంకా స్వామి వారికి నేను ఏం కైంకర్యం చేయగలను నాకా ఎటువంటి కైంకర్య విధానం కూడా తెలియదు అని చెప్పాడు. అయితే మీకు స్వామి కైంకర్యంలోని లేదా స్వామి వారి మంత్రాల్లో మీకు ఏం తెలుసో చెప్పండి అని అడిగారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అన్నాడు నాకు విష్ణు సహస్రనామంలోని రెండు శ్లోకాలు మాత్రమే తెలుసు స్వామి అని చెప్పాడు. అప్పుడు ఆ రెండు శ్లోకాలనే విడవకుండా మీరు స్మరించండి. ఇలా ప్రసాదం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఇంకోసారి రాదు అని చెప్పారు రామానుజుల వారు ఆ మరసటి రోజు నుంచి ఆ బ్రాహ్మణుడు ఆ ప్రసాద వితరణ జరిగే స్థలానికి రావడం మానేసాడు.
కానీ ఆ రోజు నుంచి ఇంకో వింత జరగడం మొదలైంది. స్వామి వారికి చేసే ప్రసాదంలో సగం మాయం అవ్వడం మొదలైంది. అయితే అది ఎలా మాయం అవుతుందో ఎవరికీ తెలియలేదు. ఈ విషయాన్ని తెలుసుకున్న రామానుజాచార్యుల వారు విషయాన్ని గ్రహించి మన వద్దకు ఇంతకుముందు ప్రసాదం కోసం వచ్చాడు కదా ఆ బ్రాహ్మణుని తీసుకొని రండి అని పంపించారు. అయితే ఆ బ్రాహ్మణుడు ఇప్పుడు ఆ ఇంట్లో ఉండట్లేదని ఖాళీ చేసి ఎక్కడికో వెళ్ళిపోయారని తెలిసింది. ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత రామానుజాచార్యుల వారు ఎక్కడికో ప్రయాణమై వెళ్తుంటే ఆ పేద బ్రాహ్మణుడు వచ్చి స్వామి వారికి ఎదురై ఆయన పాదాలపై పడి నమస్కరించి కృతజ్ఞతలు చెప్పసాగాడు. ఏమయ్యా బ్రాహ్మణుడా నువ్వు కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళావు అసలు ఎలా ఉంది నీ పరిస్థితి అని అడిగారు రామానుజుల వారు రామానుజుల వారికి ఆ బ్రాహ్మణుడు తన చేతులతో నమస్కరించి స్వామి మీరు ఆ రోజు చెప్పిన విధంగా నేను నాకు వచ్చిన రెండు శ్లోకాలను పటించాను ఆ రోజు నుంచి నా కష్టాలన్నీ తీరిపోయాయి అని చెప్పాడు అప్పుడు రామానుజల వారు అడిగారు ఎలా తీరాయని ఆ రోజు నుంచి ఒక అబ్బాయి వచ్చి నాకు మా కొడుకులకి కూడా ప్రసాదాన్ని ఇస్తూ ఉన్నాడు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎప్పుడు కూడా అతను వదలకుండా ప్రసాదం ఇస్తూనే ఉన్నాడు. మాకు ఎటువంటి ఆకలి బాధలు లేకుండా ఉన్నాయి అని చెప్పారు.
వెంటనే ఈ విషయాన్ని విని ఆశ్చర్యపోయిన రామానుజల వారు ఇంతకీ ఎవరా అబ్బాయి అని అడిగారు. అప్పుడు ఆయన అన్నారు నేను అదే ప్రశ్న అడిగాను ఆ బాబుని ఆ బాబు చెప్పాడు నేను రామానుజాచార్యుల వారి సేవకుడిని అని చెప్పారు. వెంటనే రామానుజాచార్యుల వారికి అర్థమయింది. ఆ వచ్చింది ఎవరో కాదు ఆ శ్రీరంగం శ్రీరంగనాధుడే అని చూశారు కదా స్వామి నీవు ఉన్నావు నిన్నే నమ్ముకున్నాను అని మనస్ఫూర్తిగా నమ్మిన భక్తుడికి తానే ఒక బాలుడు రూపంలో వెళ్లి నిరంతరం ప్రసాదం ఇచ్చాడు ఆ భగవానుడు మనం కూడా పరమ భక్తితో ఆ స్వామిని స్మరించి ఆ స్వామిని నిరంతరం మనం ధ్యానించినట్లయితే ఆయన కూడా నిరంతరం మన వెంటే ఉండి మనకి ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటాడు జై శ్రీమన్నారాయణ అందరూ కూడా జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి