పంచ కేదారాలు అనేవి పరమశివుని అద్భుతమైన అతి పురాతనమైన దేవాలయాలు ఈ దేవాలయాలకు సంబంధించిన అతి రహస్యమైన కథలను అసలు ఆ క్షేత్రాలు ఎలా ఏర్పడ్డాయి అనే వివరాలను ఈ రోజు మనము తెలుసుకుందాం. ఈ దేవాలయాల గురించి మాట్లాడుకునేటప్పుడు మనం కురుక్షేత్ర కాలం నాటికి వెళ్లాలి కురుక్షేత్ర యుద్ధం ముగిసిపోయిన తర్వాత పాండవులు బ్రహ్మ హత్య పాతకం దాయాదులను చంపిన పాపం పోగొట్టుకోవడానికి శివ దర్శనానికి వెళ్ళాలి అని నిశ్చయించుకుంటారు అలాగే శివునికి దర్శనం చేసుకోవడం […]
ఈ ఆరు వృక్షాలను పూజిస్తే ఎన్ని శుభ ఫలితాలు కలుగుతాయో మీరే చూడండి
హిందువులు దేవతలతో పాటుగా వృక్షాలను కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. కొన్ని కొన్ని వృక్షాలకు అంతటి మహిమ ఉంటుంది. ఎందుకంటే వృక్షాల్లో దేవతలు కొలువై ఉంటారని హిందువులు నమ్ముతారు. ఇలాంటి మహిమాన్వితమైన ఆరు వృక్షాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇందులో మొదటిగా ఉండేది ఉసిరి చెట్టు.ఉసిరి చెట్టును పూజించడం వలన సంతోషం ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తాయని నమ్ముతారు ఎందుకంటే ఉసిరి చెట్టులో విష్ణువు, శివుడు నివసిస్తారట. శివ కేశవులు కొలువై ఉండే ఇలాంటి […]
కైలాస వైకుంఠాలు మనకెంత దూరంలో ఉన్నాయ్?
మనిషిని సన్మార్గం వైపు నడిపించేది, క్రమ శిక్షణ, జీవితాన్ని ప్రసాదించేది దేవుడు. ఆ దేవుడు మీద ఉన్న భక్తి మనిషిలో ఎంతో గొప్ప పరిణితి తీసుకొస్తుంది. అయితే ఈ కాలంలో ఎంతో మంది నిజమైన భక్తి అంటే ఏమిటో తెలుసుకోలేకపోతున్నారు. దేవుడు గుడిలో ఉన్నాడని అనుకుంటారు. మరికొంద రు ఆ శివ, విష్ణువులను వారి వారి లోకాలు, నివాస ప్రాంతాలైన కైలాసం, వైకుంఠంలో వారున్నారని చెబుతుంటారు. మన భక్తి, మన పిలుపు అంత దూరం చేరాలి కదా […]
ఆంజనేయ స్వామికి తమలపాకుమాల ఎందుకు వేస్తారు?
సీతమ్మ తల్లిని రావణుడు అపహరించాడు. దాంతో రామచంద్రుడు సీతమ్మ కోసం అన్వేషణ మొదలు పెట్టాడు. రామునికి అన్వేషణలో ఆంజనేయుడు అశోకవనం చేరుకున్నాడు. సీతమ్మ అక్కడే ఉందన్న విషయం రామునితో చెప్పాలని లంక నుండి బయలుదేరతాడు. అతడు వెళ్లేటప్పుడు సీతమ్మ ఆంజనేయ స్వామిని ఆశీర్వదించాలని ఆశిస్తుంది. అయితే అశోకవనంలో ఉన్న పుష్పాలు ఆమె చేతికి అందవు. దానితో పుష్పాలకు బదులు తమలపాకును కోసి, ఆంజనేయ స్వామి తల మీద పెట్టి దీవిస్తుంది. అందుకే తమలపాకు ఆంజనేయ స్వామికి ప్రీతిపాత్రమైనది. […]
మహాలక్ష్మి అమ్మవారి రెండుచేతుల్లోను పద్మాలు ఎందుకు?
మహాలక్ష్మి అమ్మవారిని శ్రీసూక్తంలో పద్మ విశేషాలతో వర్ణిస్తారు. ఋగ్వేదంలో అమ్మవారి గురించి ఎన్నో ఋక్కులు కనబడతాయి. ” పద్మాననే పద్మ ఊరు పద్మాక్షీ పద్మ సంభవే” అని అన్ని పద్మ విశేషణాలు వాడారు. పద్మాల వంటి కన్నులు కలది, పద్మం ఆధారంగా ఉన్నది, పద్మం వంటి మోము కలది, పద్మం నుండి పుట్టినది అని సూక్తం వర్ణిస్తుంది. పంకం నుండి పుట్టినది పద్మం కానీ ఆ చిక్లీతను (బురదను) అంటించుకోదు. సంసారంలో ఆ పద్మంలాగా ఉండాలని సూచిస్తుంది. […]
రామకోటి రాయడానికి నియమాలు
🌺రామకోటి రాయడానికి పూనుకోవడం ఒక సత్కార్యం. ఈ కార్యానికి కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది రామకోటి రాయాలన్న మీ సంకల్పాన్ని ముందు దేవుడి దగ్గర మానసికంగా సంకల్పం చేసుకోండి. *శ్రీరామ అని రాసే వీలున్న కోటి గళ్ళు ఉన్నా పుస్తకం తెచ్చుకోండి. లేదా మీరే ఒక తెల్లకాగితాలతో పుస్తకం తయారుచేసుకోండి. మంచి రోజు చూసుకుని పుస్తకానికి పసుపు, కుంకుమ రాసి దేవుని సన్నిధిలో ఉంచి పుష్పాలతో, శ్రీ రామ అష్టోత్తరశతనామావళి తో పూజించండి. తరవాత పుస్తకం కళ్ళకద్దుకుని […]
