హనుమంతుడు పంచముఖాల గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. రామ- రావణ యుద్ధం జరుగుతున్నప్పుడు రాక్షస వీరులందరూ మరణిస్తూ ఉండడంతో… తన మేనమామ అయిన మైరావణుడి సాయాన్ని రావణుడు కోరు తాడు. రామలక్ష్మణులను మాయావి అయిన మైరావణుడు అపహరించి, పాతాళ లంకలో బంధిస్తాడు. వారిని విడిపించడానికి హనుమంతుడు పాతాళలంకకు వెళ్తాడు. మైరావణ నగరంలోని వివిధ దిక్కులలో ఉన్న అయిదు దీపాలను ఒకే సారి ఆర్పితేనే… మైరావణుణ్ణి చంపడం సాధ్యమని తెలుసుకుంటాడు. అయిదు ముఖాలతో ఆ అయిదు దీపాలనూ […]
అన్నపూర్ణదేవి శివునికి భిక్ష ఇస్తున్న మధుర ఘటన ఎప్పుడు జరిగింది?
ప్రతీ ఆస్తీకునికి ఈ చిత్తరువు సుపరిచితమే. “భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి” అని ఆది శంకరాచార్యులు కీర్తించిన అన్నపూర్ణాష్టకం అందరూ నోరారా పాడుకుని అమ్మవారి కరుణగా అన్నం తింటున్నాము. మనలాంటి అల్పులకు అన్నం పెట్టింది అమ్మవారు సరే మరి సంపూర్ణ పరబ్రహ్మ అయిన ఈశ్వరునికి అమ్మవారు భిక్ష ఇవ్వడం ఏమిటి? అసలేది అవసరం లేని భవుడు దేహి అని అమ్మవారిని అడగడం ఏమిటి? ఆదిభిక్షువు గా అలా ఎందుకు అవతారం ఎత్తవలసి వచ్చింది? అంటే అంతా ఆయన […]
మీ ఇంటి ముందు దిష్టిగుమ్మడికాయ కట్టారా?
ఒకవేళ మీ ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ కట్టకపోతే వెంటనే సూర్యోదయ సమయంలో ఒక తెల్లగుమ్మడికాయ తీసుకొని దానికి పసుపు,కుంకుమ రాసి దాన్ని ఇంటి ముందు ఉట్టిలో వేలాడదీయండి. ముందు రోజు సాయంత్రం తెచ్చుకొని తరువాత రోజు సూర్యోదయ సమయంలో దాన్ని ఇంటి ముందు అలంకరించండి. రెండు అగరబత్తీలు వెలిగించి దానికి ధూపం చూపించండి. ప్రతీ రోజు అంటే ఇంట్లో పూజ చేసుకున్నపుడు దానికి ఒక అగరబత్తిని వెలిగించి గుచ్చండి . ఇంటి ముందు గుమ్మడికాయ ఉండటం […]
కైలాస వైకుంఠాలు మనకెంత దూరంలో ఉన్నాయ్?
మనిషిని సన్మార్గం వైపు నడిపించేది, క్రమ శిక్షణ, జీవితాన్ని ప్రసాదించేది దేవుడు. ఆ దేవుడు మీద ఉన్న భక్తి మనిషిలో ఎంతో గొప్ప పరిణితి తీసుకొస్తుంది. అయితే ఈ కాలంలో ఎంతో మంది నిజమైన భక్తి అంటే ఏమిటో తెలుసుకోలేకపోతున్నారు. దేవుడు గుడిలో ఉన్నాడని అనుకుంటారు. మరికొంద రు ఆ శివ, విష్ణువులను వారి వారి లోకాలు, నివాస ప్రాంతాలైన కైలాసం, వైకుంఠంలో వారున్నారని చెబుతుంటారు. మన భక్తి, మన పిలుపు అంత దూరం చేరాలి కదా […]
కృష్ణునికెందుకు వేలమంది భార్యలు?
కృష్ణునికి అష్టభార్యలు కాక ఇంకా 16 వేల మంది భార్యలున్నారు. ఇంతకీ కృష్ణుడు వారి వెంటపడ్డాడా లేక వాళ్ళు ఆయన వెంట పడ్డారా? రుక్మిణీ కళ్యాణం ఎలా జరిగిందో అందరికీ తెలుసు. రుక్మిణీదేవి తనకు శిశుపాలునితో వివాహం జరగబోతోందని, అది తనకిష్టం లేదని, తను కృష్ణుడినే భర్తగా వరించానని,తన్ని శిశుపాలుడి నుంచి రక్షించి, వివాహమాడమని ఒక బ్రాహ్మణుడితో సందేశం పంపింది. దాని ప్రకారం కృష్ణుడు రుక్మిణిని వివాహం చేసుకున్నాడు. తక్కిన భార్యలను గూడా సాహసకృత్యాలు చేసి గెలిచి […]
రాముడు సీతాపరిత్యాగమెందుకు చేసాడు?
రాముడు అవతారపురుషుడైనప్పటికీ మానవుడిలాగ ప్రవర్తించి,మానవుడు ఎలా ఆదర్శపురుషుడుగా జీవించగలడన్నది ఆచరించి చూపించాడు. తాను అలా జీవించి మనకారాధ్యుడయ్యాడు. ఇంక ఆయన సీతాదేవిని ఎందుకు త్యజించాల్సివచ్చిందో గూడా తెలుసుకోవాలి. సీతారాములు చాలాకాలం జీవించారు. దాదాపు 11వేల సం॥లని రామాయణంలో ఉంది. దేవతల ప్రార్థన వల్ల వారికి అవతార సమాప్తి చేయాల్సిన సమయం వచ్చింది. అందువల్ల ముందుగా ఓ అపవాదుని సృష్టించి సీతను త్యజించాడు. ఆ విషయాన్ని గూర్చి సీతతో సమాలోచన చేసాడు ముందుగా. ఆవిడ గర్భవతని తెలుసు. అందుకే […]
ఆంజనేయ స్వామికి తమలపాకుమాల ఎందుకు వేస్తారు?
సీతమ్మ తల్లిని రావణుడు అపహరించాడు. దాంతో రామచంద్రుడు సీతమ్మ కోసం అన్వేషణ మొదలు పెట్టాడు. రామునికి అన్వేషణలో ఆంజనేయుడు అశోకవనం చేరుకున్నాడు. సీతమ్మ అక్కడే ఉందన్న విషయం రామునితో చెప్పాలని లంక నుండి బయలుదేరతాడు. అతడు వెళ్లేటప్పుడు సీతమ్మ ఆంజనేయ స్వామిని ఆశీర్వదించాలని ఆశిస్తుంది. అయితే అశోకవనంలో ఉన్న పుష్పాలు ఆమె చేతికి అందవు. దానితో పుష్పాలకు బదులు తమలపాకును కోసి, ఆంజనేయ స్వామి తల మీద పెట్టి దీవిస్తుంది. అందుకే తమలపాకు ఆంజనేయ స్వామికి ప్రీతిపాత్రమైనది. […]
శనివారంఅంటే శ్రీనివాసునికి ఎందుకు అంత ఇష్టం?
* ఓంకారం ప్రభవించిన రోజు శనివారం * శ్రీనివాసుడు మహాలక్ష్మి ని తన వక్షస్థలం లో నిలిపిన రోజు శనివారం *శ్రీనివాసుడు తిరుమల లో భక్తులకు( గొల్లవానికి) * మొట్టమొదటిసారి దర్శనం ఇచ్చిన రోజు శనివారం *ఆనందనిలయం నిర్మించమని తొండమాను చక్రవర్తికి చెప్పిన రోజు శనివారం * ఆనందనిలయం నిర్మాణం పూర్తిఅయిన రోజు శనివారం *శ్రీ సుదర్శనచక్రం పుట్టినరోజు శనివారం * శ్రీనివాసుడు ఆనందనిలయంలో ప్రవేశించిన రోజు శనివారం * శ్రీనివాసుడు అలిమేలు మంగమ్మ ని పెళ్లి […]
మహాలక్ష్మి అమ్మవారి రెండుచేతుల్లోను పద్మాలు ఎందుకు?
మహాలక్ష్మి అమ్మవారిని శ్రీసూక్తంలో పద్మ విశేషాలతో వర్ణిస్తారు. ఋగ్వేదంలో అమ్మవారి గురించి ఎన్నో ఋక్కులు కనబడతాయి. ” పద్మాననే పద్మ ఊరు పద్మాక్షీ పద్మ సంభవే” అని అన్ని పద్మ విశేషణాలు వాడారు. పద్మాల వంటి కన్నులు కలది, పద్మం ఆధారంగా ఉన్నది, పద్మం వంటి మోము కలది, పద్మం నుండి పుట్టినది అని సూక్తం వర్ణిస్తుంది. పంకం నుండి పుట్టినది పద్మం కానీ ఆ చిక్లీతను (బురదను) అంటించుకోదు. సంసారంలో ఆ పద్మంలాగా ఉండాలని సూచిస్తుంది. […]
పూజ చేసిన తర్వాత పసుపు గణపతిని ఏమి చేయాలో తెలుసా?
హిందూ సంప్రదాయాల ప్రకారం మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసుకున్నా ముందుగా వినాయకుడి పూజ చేస్తుంటాం. అయితే ప్రథమ పూజ కచ్చితంగా వినాయకుడికే చేయాల్సి ఉంటుందని వేద పండితులు చెప్తుంటారు. అందుకే పసుపుతో గణపతిని తయారు చేసి. మనం చేసే పూజలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా చూడమని కోరుకుంటూ ముందుగా పూజ చేసు కుంటాం. అయితే పూజ అయిపోయన తర్వాత పసుపు గణపతిని ఏం చేయాలో చాలా మందికి తెలియదు. కొందరైతే స్నానం చేసే […]
