ఓం గం గణపతయే నమః తిరుమల స్వామి వారికి నైవేద్యం సమర్పించే విధానం గురించి మీకు తెలుసా అతి తక్కువ మందికి మాత్రమే తెలిసిన వివరాలతో శ్రీవారి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు గారు ది సీక్రెట్ ఫుడ్ ఆఫ్ గాడ్ స్వామివారి పవిత్ర ప్రసాదాలు అనే పుస్తకం రాశారు. అందులో శ్రీ వారికి నైవేద్యం ఎలా పడతారు అన్నది కూడా రాసి ఉంది. ఆ వివరాలు ఈ వీడియోలో మీకు చెప్తాను. మన వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రసాదం సమర్పించడానికి ముందు గర్భాలయాన్ని నీళ్లతో శుద్ధి చేస్తారు.
గాయత్రీ మంత్రం జపిస్తూ, నీళ్లు చల్లుతారు. వండిన ప్రసాదాలను మూత పెట్టిన గంగాలాల్లో దేవుడు ముందు ఉంచుతారు. స్వామి ప్రసాదాలు నైవేద్యం సమర్పించే అర్చకుడు మాత్రమే గర్భగుడిలో ఉంటారు. అనంతరం గర్భాలయం తలుపులు మూసేస్తారు. విష్ణు గాయత్రీ మంత్రం పటిస్తూ అర్చకుడు ప్రసాదాల మీద నెయ్యి తులసాకులు చల్లుతారు. కుడి చేతి గ్రాస ముద్రతో ప్రసాదాన్ని తాకిన అర్చకుడు స్వామి కుడి చేతికి దానిని తాకించి నోటి దగ్గర ఉంచుతారు అంటే స్వామికి గోరుముద్దలు తినిపించడం అన్నమాట పవిత్ర మంత్రాలు ఉచ్చరిస్తూ అన్న సూక్తం నిర్వహిస్తారు చరాచర సృష్టికి కర్త అయిన స్వామికి నైవేద్యం సమర్పించడం అంటే సృష్టిలో ఆకలితో ఉన్న సమస్తాన్ని సంతృప్తి పరచడమే ఈ విధంగా స్వామిని వేడుకుంటూ ముద్ద ముద్దకి నడుమ ఔషధ గుణాలు ఉన్న ఆకులు కలిపిన నీటిని సమర్పిస్తారు. నైవేద్యం సమర్పించేంత వరకు ఆలయంలో గంట మోగుతూనే ఉంటుంది
ఇది స్వామికి భోజనానికి పిలుపుగా దీనిని భావిస్తారు రోజుకు మూడు పూటల స్వామికి నైవేద్యం సమర్పిస్తారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే ప్రసాదం వండేవారు వంట సమయంలో గాని తర్వాత గాని వాసన చూడరు వాసన చూడకుండా ఉండడం కోసం ముక్కు నోటికి అడ్డుగా వస్త్రం పెట్టుకుంటారు.
ఇక శ్రీవారికి సమర్పించే దాకా బయట వారు ఎవరూ దానిని చూడరు కూడా ఈ విధంగా తిరుమలలో ఆ శ్రీనివాసునికి నైవేద్యం సమర్పించే విధానం జరుగుతూ ఉంటుంది. ఈ విషయం మీరు మొదటిసారి తెలుసుకున్నట్లయితే మన వీడియోని లైక్ చేయండి చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి.