హనుమంతుడు పంచముఖాల గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. రామ- రావణ యుద్ధం జరుగుతున్నప్పుడు రాక్షస వీరులందరూ మరణిస్తూ ఉండడంతో… తన మేనమామ అయిన మైరావణుడి సాయాన్ని రావణుడు కోరు తాడు. రామలక్ష్మణులను మాయావి అయిన మైరావణుడు అపహరించి, పాతాళ లంకలో బంధిస్తాడు. వారిని విడిపించడానికి హనుమంతుడు పాతాళలంకకు వెళ్తాడు. మైరావణ నగరంలోని వివిధ దిక్కులలో ఉన్న అయిదు దీపాలను ఒకే సారి ఆర్పితేనే… మైరావణుణ్ణి చంపడం సాధ్యమని తెలుసుకుంటాడు. అయిదు ముఖాలతో ఆ అయిదు దీపాలనూ ఊది ఆర్పేస్తాడు. ఆ విధంగా మైరావణ వధ జరిగింది. ఆంజనేయుడు ధరించిన ఆ అయిదు. ముఖాలు: తూర్పున తన సహజసిద్ధమైన వానర ముఖం, పశ్చిమాన గరుడ ముఖం, దక్షిణాన నృసింహ ముఖం. ఉత్తరాన వరాహ ముఖం, ఉర్ధ్వ దిశలో హయగ్రీవ ముఖం. ఇక… శివాంశ సంభూతుడైన హనుమంతుని పంచముఖాలను శివుని పంచముఖాలైన సద్యోజాత (వానర), అఘోర (గరుడ), తత్పురుష (వరాహ), వామదేవ (నారసింహ), ఈశాన (హయ గ్రీవ) ముఖాలుగా కూడా వర్ణి స్తారు. వానర ముఖం అభీష్టసి ద్ధిని, గరుడ రూపం దీర్ఘాయు వును, వరాహ ముఖం ఐశ్వ ర్యాన్ని, నారసింహ ముఖం శత్రువులపై విజయాన్ని, హయగ్రీవ రూపం జ్ఞానాన్నీ, మోక్షాన్నీ కలుగజేస్తాయనేది భక్తుల విశ్వాసం.