హిందువులు దేవతలతో పాటుగా వృక్షాలను కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. కొన్ని కొన్ని వృక్షాలకు అంతటి మహిమ ఉంటుంది. ఎందుకంటే వృక్షాల్లో దేవతలు కొలువై ఉంటారని హిందువులు నమ్ముతారు. ఇలాంటి మహిమాన్వితమైన ఆరు వృక్షాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం.
ఇందులో మొదటిగా ఉండేది ఉసిరి చెట్టు.
ఉసిరి చెట్టును పూజించడం వలన సంతోషం ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తాయని నమ్ముతారు ఎందుకంటే ఉసిరి చెట్టులో విష్ణువు, శివుడు నివసిస్తారట. శివ కేశవులు కొలువై ఉండే ఇలాంటి ఉసిరి చెట్టుకి పూజించడం వలన వీటితో పాటుగా ఇంకెన్నో అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి.
ఇక రెండవ చెట్టు రావి చెట్టు.
రావి చెట్టుకు కూడా ఎంతో విశిష్టత ఉంది సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు శ్రీమద్ భగవద్గీతలో చెట్లలో రావి చెట్టు అనేది అత్యంత శ్రేష్టమైనది అని చెప్పారు అంతేకాదు సాక్షా బుద్ధ భగవానుడు కూడా ఈ చెట్టు కింద దివ్యజ్ఞానాన్ని పొందాడట. మరీ ముఖ్యంగా సంతానం కోసం ఎదురుచూసే స్త్రీలు రావి చెట్టును గనక పూజించినట్లయితే తప్పకుండా వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందట. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఎటువంటి కీటకాలు చేరని ఏకైక వృక్షం రావి చెట్టు.
ఇక మూడవ వృక్షం బిల్వ వృక్షం అదే మారడచెట్టు
శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో బిల్వ పత్రం చాలా ముఖ్యమైనది శివునికి బిల్వపత్రాలు సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి అని శివుని ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. అలాంటి అద్భుతమైన బిల్వ వృక్షాన్ని పూజించడం వల్ల కూడా ఎన్నో అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి, బిల్వ వృక్షం ఇంటి పరిసరాల్లో ఉంటే అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయి.
ఇక నాలుగవ పవిత్రమైన వృక్షం అరటి చెట్టు
ఎటువంటి పూజారి కార్యక్రమాలు చేసిన అరటి ఆకులు అరటి చెట్లు అతిముఖ్యంగా ఉపయోగిస్తాం ఎందుకంటే అరటి చెట్టులో ఉండే ఆయుర్వేద మూలికలు మతపరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో ఎంతో లాభాన్ని చేకూరుస్తాయి. మరీ ముఖ్యంగా మనం ఎంతో పవిత్రంగా భావించి చేసే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం రోజున ఈ అరటి చెట్లను స్వామివారికి అలంకారంగానే పెడుతూ అరటి ఆకుల్లోనే భోజనం చేసే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. అలాంటి అరటి చెట్టును పూజించడం ద్వారా అలాగే ఇంటికి ఇరువైపులా అరటి చెట్లను పెంచడం వల్ల కూడా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి.
ఐదవ అతిముఖ్యమైన వృక్షం మర్రిచెట్టు
మర్రి చెట్టులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువై ఉంటారట ఈ మర్రిచెట్టు ని పూజిస్తే త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఒకేసారి పూజించిన ఫలితం దక్కుతుంది. ముఖ్యంగా ఎందరో అత్యద్భుతంగా జరుపుకునే శ్రీ త్రినాధమేళా కథలో కూడా మర్రిచెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు అనే కథని మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి అద్భుతమైన మర్రి వృక్షాన్ని పూజించినట్లయితే త్రిమూర్తులను పూజించిన ఫలితం దక్కుతుంది అలాగే కోరిన కోరికలు కచ్చితంగా నెరవేరుతాయి.
ఆరవ వృక్షం వేప చెట్టు
వేప చెట్టు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. దేవతారాధనలో ముఖ్యంగా అమ్మవారిని పూజించేవారు రకరకాల అమ్మవార్ల పేర్లతో పిలుచుకున్న అమ్మవారు వేప చెట్టులో కొలువై ఉంటుందని నమ్ముతారు. అంతేకాదు వేప చెట్టులో ఉండే ఆయుర్వేద గుణాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది ఎంత మంచిది అంటే వేప చెట్టు నుండి వచ్చే గాలి పీల్చిన సరే అది ఒంటికి ఆరోగ్యానికి ఎంతో మంచిదని పెద్దలు చెబుతూ ఉంటారు వేప చెట్టులో అన్ని ఆయుర్వేద గుణాలు కలిసి ఉంటాయి ఎక్కడ గ్రామ దేవతలను పూజించిన ఎక్కువగా వేప చెట్టులో అమ్మవారిని ఉన్నట్టుగా భావించి పూజలు చేస్తారు ఇలాంటి అద్భుతమైన వేప చెట్టును పూజించినట్లయితే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి.
ఇలాంటి అద్భుతమైన వృక్షాలను పూజించి మనం కూడా సభ ఫలితాలను పొందుదాం.
సర్వేజనా సుఖినోభవంతు